OPD Services

/OPD Services
OPD Services2019-01-25T07:10:55+00:00

Outpatient Department

OPD timings 9-00 AM to 12-00 PM on all days.

Emergency cases will be attended 24 (x) 7.

Inpatient services are being added on every day.

NTR Vaidya Seva, Employees Health Scheme, Working Journalists Health Scheme, Central Government Health Scheme services are also available.

VIMS హాస్పిటల్ మనందరిదీ. మీ కష్టకాలంలో ఆదుకునేందుకు ఇక్కడి డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బంది మీకు అందుబాటులో ఉన్నారు.

మీరు చికిత్స ఎలా పొందాలి?

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి అయితే ముందుగా EMD/Casualty డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించాలి.

సాధారణ రోగులు 1 వ నంబరు కౌంటర్లో ఓపి టికెట్ కొనుక్కుని మీ జబ్బు చెప్పితే ఏ ఓపీకి వెళ్లాలో ఓ పి టికెట్ మీద నెంబర్ వేస్తారు. ఆసుపత్రులో ఉచితంగా ఇచ్చే మందులకు ఈ ఔషధీ ఫారం కూడా ఇస్తారు. సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ ఆ OP లో మీకు చికిత్స చేస్తారు.
స్పెషలిస్ట్ డాక్టర్ గారు రోగిని తనిఖీ చేసి అవసరం అయితే వెంటనే మందులు రాస్తారు. ఆ మందులు ఈ ఔషధీ ఫారం లో కూడా రాస్తారు. అది పట్టుకుని తర్వాత బిల్డింగ్ లో ఉన్న ఫార్మసీ కి వెళితే మందులు ఇస్తారు.
ఒకవేళ రోగికి రక్త పరీక్షలు స్కానింగ్ పరీక్షలు అవసరం అయితే డాక్టర్ గారు రాస్తారు. ఆ పరీక్ష పత్రాలను ఎదురు బిల్డింగ్ లో ఉన్న పేథ్ కేర్ కు తీసుకొని వెళితే వాటిని తక్కువ ఖర్చుతో చేస్తారు. ఆ టెస్ట్ తాలూకా రిపోర్టులు కొన్ని గంటల తర్వాత గాని మర్నాడు గాని ఇస్తారు. ఆ రిపోర్టును తనిఖీలు వ్రాసిన డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళితే తగిన మందులు వ్రాస్తారు. ఆపరేషన్ ఏదైనా అవసరమైతే ఆ విషయం చెబుతారు.
మీరు హాస్పటల్లో జాయిన్ అవ్వాలా?
ఒకవేళ రోగి హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వస్తే మీకు చెప్పి ఓపి కార్డులో ఆ విషయం రాస్తారు. ఆ కార్డు పట్టుకొని ఒకటో నెంబర్ గదిలో తగిన రుసుము చెల్లించి ఎదురు బిల్డింగ్ లో ఉన్న వార్డ్ లో జాయిన్ అవ్వాలి.
ఎన్టీఆర్ వైద్య సేవ లో చికిత్స ఉచితం. మిగతా వాటికి చాలా తక్కువ ఖర్చుతో చికిత్స చేయబడుతుంది.
మన ఆసుపత్రిని డాక్టర్లను నర్సులను మరియు ఇతర సిబ్బంది సంఘ విద్రోహక శక్తుల నుండి కాపాడుకుందాం.